- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరస్ సోకితే.. పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఎలా..?
దిశ, హైదరాబాద్ ప్రతినిధి: కరోనా మహమ్మారి డాక్టర్లు, సిబ్బందినీ వదలకపోవడంతో గర్భిణులు టెన్షన్ పడుతున్నారు. ప్రతీనెల చెకప్, డెలివరీకి హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉండడంతో వారిని కరోనా భయం వీడడం లేదు. ఒకవేళ తమకు వైరస్ సోకితే.. పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఎలా అని ఆందోళణ చెందుతున్నారు. కాగా, గర్భిణులు టెన్షన్ పెట్టుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని, అందువల్ల డెలివరీ సమయంలో సీరియస్ కండీషన్‌లోకి వెళ్తారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సిటీలో నాలుగు ఆస్పత్రుల్లో..
హైదరాబాద్ నగరంలో పేట్లబుర్జు, సుల్తాన్ బజార్‌లలో పేరొందిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇవే కాకుండా నీలోఫర్ ఆస్పత్రిలో కూడా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కేసులు మొదలు కాక ముందు కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో కూడా గర్భిణులకు వైద్యం అందించే వారు. అయితే కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ కరోనా వైద్యం మినహాయిస్తే ఇతర ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి గర్భిణులు ఆయా ఆస్పత్రులకు నెల నెలా వచ్చి వైద్య పరీక్షలు, డెలివరీ కూడా అదే హాస్పిటల్‌కు వెళ్తుంటారు. కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పేట్ల బుర్జు, నీలోఫర్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండడంతో గర్భిణులు ఆందోళన చెందుతున్నారు. నెల నెలా చికిత్స చేసుకున్నామని, ఇక ముందు కూడా హాస్పిటల్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రసవాల కోసం ఆయా ఆస్పత్రులకు వెళితే కరోనా ఎక్కడ తమకు అంటుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రైవేట్‌కు వెళ్లలేక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూపించుకోలేక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి.
మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం: డా.పుట్లా శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు పేట్లబుర్జు, నీలోఫర్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడడం, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించడంతో గర్భిణులు ఆందోళన చెందుతున్న మాట నిజమే. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు డీఎంఈ డా. రమేశ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. నీలోఫర్, పేట్లబుర్జు, కింగ్ కోఠి ఆస్పత్రులకు ప్రత్యామ్నాయంగా కోఠి ఆస్పత్రి నూతన భవనాన్ని వీలైనంత త్వరగా వినియోగించుకోవాలి. రోగులకు వైద్యం అందించే సమయంలో డాక్టర్లు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలి.