- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమానుషం: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డ మృతి
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పుల్లాయిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగా నిండు గర్భిణి మృతిచెందింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పూనెం కమల కాన్పు కోసం ఈనెల 2వ తేదీన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేరి నాలుగు రోజులైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో గర్భిణీ ఆరోగ్యం క్షీణించింది. కొత్తగూడెం ఆసుపత్రికి తరలించాలని చేతులెత్తేశారు. దీంతో ఆందోళన చెందిన వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అప్పటికే బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం గర్భిణీ కమల ఆరోగ్యం మరింత క్షీణించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరిలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య కమల, బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని భర్త కుమార్ రోధిస్తున్నాడు.