అర్ధరాత్రి నడిరోడ్డుపై.. గర్భిణి ప్రసవం

by Shyam |

దిశ, నల్లగొండ: అర్ధరాత్రి సమయంలో ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన ఓ గర్భిణికి బుధవారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్ చేశారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో స్కూటీపైనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై.. రోడ్డుపైనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రి వెళ్లగా, వారిని వైద్యాధికారి అనుమతించలేదు.

Tags: Pregnant, Childbirth, Midnight, Road, suryapet, nalgonda, 108, doctors

Advertisement

Next Story

Most Viewed