- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5th క్లాస్ విద్యార్థినికి గర్భం.. స్కూల్లోనే అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : పాఠ్య పుస్తకాల బ్యాగ్‌తో పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక.. గర్భావతిగా క్లాస్‌లకు హాజరైంది. చాక్లెట్స్ తీనాల్సిన ప్రాయంలో గర్భ నిరోధక మాత్రలు మింగింది. గర్భం అంటే ఏంటో తెలియని 11 ఏళ్ల వయసులోనే గర్భ విచ్ఛినానికి పాల్పడింది. 5వ తరగతిలోనే అమ్మలా మారబోయింది. ఇంతకూ ఆ చిన్నారిని గర్భవతిని చేసింది ఎవరు..? పద్యాలు వల్లె వేయాల్సిన ఆమెకు.. కామ పాఠాలు నేర్పింది ఎవరు..? ఆడుకునే ఆమెను అమ్మను చేయాలని చూసిన కామ పిశాచి ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని ఫుల్వారి షరీఫ్ ప్రాంతం. అక్కడో కార్పొరేట్ స్కూల్ ఉంది. దాని యజమాని రాజ్ సింఘానియా అలియాస్ అర్వింద్. ఆయనే ప్రిన్సిపల్‌గా వ్యవహరించేవాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. ఉన్నత ఆశయాలతో పాఠశాలను స్థాపించాడు. కానీ గురువుకు ఉంటే లక్షణాలు ఎక్కడా కనిపించవు అతడిలో. క్లాస్ రూంలో పాఠాలు చెప్పడం అతడి వృతి.. కానీ విద్యార్థినులకు కామ పాఠాలు చెప్పడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ స్కూల్‌లో 5వ, తరగతి చదివే 11 ఏళ్ల బాలికపై అతడి కన్ను పడింది.
స్కూల్‌లో పని చేసే అభిషేక్ కుమార్ సహాయంతో ఆ బాలికను తన క్యాబిన్‌లోకి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలా ఒక్కరోజో.. రెండు రోజులో కాదు.. నెలల తరబడి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో సెల్ ఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాడు. విషయం ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతానని బెదించాడు. దీంతో ఆందోళన చెందిన బాలిక తనపై ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలో బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక గర్భిణీ అని తేలడంతో వారు షాక్‌కు గురయ్యారు. బాలికను నిలదీయగా.. స్కూల్‌లో రోజూ జరుగుతున్న కీచకపర్వాన్ని వివరించింది.
సమాచారం అందుకున్న పోలీసులు బాలిక నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బాలికకు అబార్షన్ చేయించారు. కీచక ప్రిన్సిపల్ అర్వింద్‌ను అరెస్ట్ చేశారు. అయితే అర్వింద్ తన పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని చూశాడు. ఎవిడెన్స్ దొరకకుండా పాఠశాలను సైతం తగలపెట్టించాడు. అయినా పోలీసులు డీఎన్ఏ రిపోర్టుతోపాటు పలు సాక్ష్యాలను సేకరించి కోర్టులో నిందితుడికి శిక్షపడేలా చేశారు.
2018 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరగగా.. 2021 ఫిబ్రవరి 16న పాట్నాలోని ప్రత్యేక పోక్సో కోర్టు ఈ కేసుపై తుది తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి అవదేశ్ కుమార్ ఈ కేసును అత్యంత అరుదైనదిగా పేర్కొన్నారు. నిందితుడు అర్వింద్ ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇలాంటి నేరానికి పాల్పడిన నిందితుడికి మరణ శిక్ష విధిస్తున్నానని తీర్పు చెప్పారు. అలాగే రూ.లక్ష జరిమానా కట్టాలని ఆదేశించారు. అర్వింద్‌కు సహకరించిన మరో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. బాధితురాలికి బీహార్ బాధితుల పరిహార పథకం కింద రూ.15 లక్షలు అందజేయాలని ఆదేశించారు.