ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు చేయాలి: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు

by Harish |
cs-somesh-kumarc
X

దిశ ప్రతినిధి హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా గతంలో మాదిరిగా నూతన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య చైర్మన్ బత్తిని రాజేశం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గురువారం సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం రాజేశం మాట్లాడుతూ గతంలో ఆయా కార్పొరేషన్ల పాలక వర్గం ఆమోదంతో వేతన సవరణను అమలు చేసుకోవటం జరిగిందన్నారు. అయితే ఈ పర్యాయం ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తర్వాతనే కార్పొరేషన్‌లలో నూతన వేతన సవరణ అమలు చేసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నందున తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌లో తప్ప ఏ ఒక్క కార్పొరేషన్‌లో కొత్త
వేతన సవరణ అమలు కాలేదని తెలిపారు . దీనికి ప్రభుత్వప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించి, వెంటనే తగు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రాజేశం వెల్లడించారు . ఈ కార్యక్రమంలో సమాఖ్య సెక్రటరీ జనరల్ జీటీ జీవన్, కో చైర్మన్ లు ఇంద్రకుమార్, యాదయ్య, సత్యం, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed