- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రణీత సుభాష్.. సేవలు భేష్
బొంగరాల్లాంటి కళ్లు.. ఇట్టే పడగొట్టే నవ్వుతో క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది ప్రణీత సుభాష్. సినిమాలో చిన్న పాత్రయినా సరే.. తన స్ర్కీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకునేది. కానీ, ఇప్పుడు ప్రణీత అంటే మనసున్న మగువ.. కష్టాల్లో ఉన్నవారికి పిలిచి మరీ అన్నం పెట్టే బాపుగారి బొమ్మ. కల్మషం లేకుండా కన్నీటిని తుడవగల అందాల భరిణి.
కరోనా మహమ్మారి ప్రభావంతో నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో తల్లడిల్లిపోతుంటే.. ప్రణీత అయ్యో పాపం అని చూస్తూ కూర్చోలేదు. అన్నపూర్ణలా మారి వారి ఆకలి తీర్చింది. స్వయంగా బాధితుల దగ్గరకెళ్లి సరుకులు పంచింది. కర్ణాటకలో శనివారం నుంచి ఆటో సర్వీసలు ప్రారంభం కాగా.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు, ప్రయాణికులు ఒకరినొకరిని వేరు చేసేలా.. ట్రాన్స్‌పరెంట్ షీట్స్ పంపిణీ చేసింది. అంతేకాదు ఆటోలో ప్రయాణించి ఆ ఆనందాన్ని ఆస్వాదించిన ప్రణీత సుభాష్.. ఆటోడ్రైవర్లకు భరోసా ఇచ్చేలా మంచి సందేశం ఇవ్వడంతోపాటు మానవత్వం మరిచిపోవద్దని చెప్పింది. ‘తోటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం సాటి మనిషిగా మన బాధ్యత అని.. మనకు తోచిన సహాయం చేద్దాం’ అని పిలుపునిస్తోంది.
ఇంత చిన్నవయసులో పెద్ద మనసుతో ఆలోచిస్తూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ప్రణీత.. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.