- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారా బ్యాడ్మింటన్ టోర్నో ఫైనల్‌లో ప్రమోద్, సుకాంత్
దిశ, స్పోర్స్ : ఇండియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ పారా బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రమోద్ భగత్, వరల్డ్ నెంబర్ 5 ర్యాంకర్ సుకాంత్ కదమ్ దుబాయ్‌లో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివార జరిగిన ఎస్ఎల్3 కేటగిరీ సెమీస్‌లో మలేషియాకు చెందిన మహమ్మద్ హజారీతో తలపడిన భగత్ 21-7, 21-17 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్‌లో కుమార్ నితీష్‌తో తలపడనున్నాను. ఎస్ఎల్ 4 కేటగిరీ సెమీస్‌లో జర్మనీకి చెందిన మార్సెల్ ఆడమ్‌తో తలపడిన సుకాంత్ కదమ్ 21-11, 21-11 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు.
పురుషుల డబుల్స్ సెమీస్‌లో ప్రమోద్-మనోజ్ శకంర్ జంట ఇండియాకు చెందిన మహ్మద్ అన్సారీ, దీప్ రంజన్‌పై 21-19, 23-21 తేడాతో విజయం సాధించారు. ఫైనల్‌లో ఇండియాకు చెందిన సుకాంత్ కదమ్-కుమార్ నితీష్ జోడీతో తలపడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఇండియాకు చెందిన ప్రమోద్-పాలా కోహ్లీ జోడి ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్-ఫౌస్టీన్ నోయల్ జోడీపై 17-21, 5-21 తేడాతో ఓడిపోయారు.