- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోకల్, నాన్ లోకల్ ఏంటి.? ఏ దేశంలో ఉన్నాం :ప్రకాష్‌రాజ్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రసీమలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత, హేమ ఉండగా, ప్రకాష్‌రాజ్ 27 మందితో తన ప్యానెల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రకాష్‌రాజ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్‌రాజ్ సడన్‌గా వచ్చినవాడు కాదని, ఏడాది నుండి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, నిన్న, మొన్న ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. ‘మా’ అందరికి ఎందుకు వినోదంగా మారిపోయిందని ప్రశ్నించారు. కళ్ల ముందు ఉన్నవారు సగం మందేనని, కొందరు పెద్దలున్నారు వాళ్లురారు, రావాల్సిన అవసరం లేదన్నారు.
ఎన్నికలు చాలా సున్నితమైనవని, అందరూ అందరికి కావాల్సినవాళ్లేనన్నారు. ఇప్పటివరకు ఎన్నికైన అధ్యక్షులు ఎవరికి వీలైనంత వాళ్లు చేశారు. ఎవరో ఏదో చేయలేదని చెప్పడానికి నేను రాలేదని స్పష్టం చేశారు. నా ప్యానెల్‌లో అధ్యక్షులుగా పనిచేసినవారు నలుగురు ఉన్నారని, నేనే తప్పుచేస్తే నన్నే బయటకు పంపించే గట్టివాళ్లు మా ప్యానెల్‌లో ఉన్నారన్నారు. ఈ విషయంలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని, వారు ఈ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దని వెల్లడించారు. కళాకారులకు లోకల్, నాన్ లోకల్ ఏంటని..? ఏ దేశంలో ఉన్నాం మనం..? ప్రశ్నించిన ప్రకాష్‌రాజ్, కళాకారులు యూనివర్సల్ అని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించాలని కోరారు.