30వ తేదీన ప్రజావాణి రద్దు : కలెక్టర్ వెంకట్రామ రెడ్డి

by Shyam |
30వ తేదీన ప్రజావాణి రద్దు : కలెక్టర్ వెంకట్రామ రెడ్డి
X

దిశ, సిద్దిపేట : ఈ నెల 30వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు క్రీయాశీలక భాగస్వామ్యం కావడం, మండల స్థాయి అధికారులు క్లస్టర్ అధికారులుగా క్షేత్ర స్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించనున్నారు.

అలాగే స్కూల్స్ ఆవరణ, తరగతి గదులు, భోజనం చేసే ప్రాంతాలతో పాటు పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచే పనులను పర్యవేక్షణ చేస్తారు. ఈ క్రమంలో పని ఒత్తిడిలో బిజీగా ఉండటం వల్ల ఈ నెల 30వ తేదీన కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కేంద్రాలలో నిర్వహించాల్సిన ప్రజావాణినీ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story