సైబరాబాద్ పోలీసులకు పీపీఈ కిట్లు అందజేత

by Shyam |
సైబరాబాద్ పోలీసులకు  పీపీఈ కిట్లు అందజేత
X

దిశ, హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న సైబరాబాద్ పోలీసులకు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్‌లను శుక్రవారం అందించింది. ఈ సందర్భంగా 750 పీపీఈ కిట్లు, 750 ఫేస్ షీల్డ్స్ (పోర్ట్రానిక్స్), 2500 ఎన్ -95 మాస్క్‌లను సజ్జనార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఐడిసి ఎండి రాజీవ్ కుమార్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సందీప్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అడ్మిన్ మిథిలింకా, బిజినెస్ ప్రోగ్రామర్ మేనేజర్ విజయ్ వావిలాలా, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల పాల్గొన్నారు.

Advertisement

Next Story