- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వనపర్తికి కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు..
దిశ, వనపర్తి: వనపర్తికి నియోజకవర్గానికి రూ.5.63 కోట్లతో మూడు నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేస్తూ విద్యుత్ శాఖ ఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేసారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన ద్వారా వివరాలను వెళ్లడించారు. వనపర్తి నియోజకవర్గం లోని ఘణపురం మండలం అల్లమాయపల్లి, పెద్దమందడి మండలం మంగంపల్లి, శ్రీ రంగాపురం మండలం తాటిపాములకు నూతన 33/11 కేవీ, అల్లమాయపల్లికి రూ.1.86.90 కోట్లు, తాటిపాములకు రూ.1.91.83 కోట్లు, మంగంపల్లికి రూ.1.84.30 కోట్లు మంజూరు చేస్తూ విద్యుత్ శాఖ ఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేసారన్నారు.
గత ఏడేళ్లలో దాదాపు వనపర్తి నియోజకవర్గానికి 18 కరెంటు సబ్ స్టేషన్లు మంజూరు చేయించామని, అందులో 14 సబ్ స్టేషన్లు పనులు పూర్తి అయ్యాయానీ తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల విద్యుత్ కష్టాలను తీర్చేందుకు నూతనంగా నియోజకవర్గానికి 3 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.