- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసక్తికరంగా పవర్ స్టార్ ట్రైలర్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన పవర్ స్టార్ చిత్రాన్ని ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు అనుకున్నట్లుగానే విడుదల చేశాడు. అయితే ట్రైలర్ చూడాలంటే రూ. 25 చెల్లించాలని కండిషన్ పెట్టిన వర్మకు ఊహించని విధంగా షాక్ తగిలింది. పవర్ స్టార్ ట్రైలర్ లీక్ కావడంతో తన ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ట్రైలర్ రిలీజ్ చేశాడు. ట్రైలర్ కోసం రూ. 25 పే చేసిన అందరకీ వర్మ తిరిగి డబ్బులు ఇచ్చేస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ‘ఈ చిత్రం పవన్ కల్యాణ్ అభిమానులకు అంకితం’ అంటూ మొదలుపెట్టాడు.
పవర్ స్టార్ ఎన్నికల్లో ఓడిపోవడం దానికి తీవ్రంగా భాధపడటం, ఓటమి తర్వాత పవన్ పరిస్థితి ఎలా మారింది. తన నిర్ణయాలు ఏవిధంగా ఉన్నాయి. ఓటమికి ఎవరు కారణం? అసలు రాజకీయాల్లో ఉండాలా? లేదా? ప్రతిపక్షంతో వచ్చిన ఇబ్బందులు ఏమిటి? తన వ్యక్తిగత జీవితంపై ఓటమి ప్రభావం ఎలా ఉంది. తన జీవితంలోని వ్యక్తులు పవన్‌ను ఎలా ఉపయోగించుకున్నారు? ఇలా తదితర అంశాల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది. పవన్ తన భవిష్యత్ గురించి ఎటూ తేల్చుకోలేని టైమ్‌లో ఆయన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు? అతను పవన్‌ను ఎలా ప్రభావితం చేశాడు? ఇలా ఆసక్తికర అంశాలతో వర్మ ట్రైలర్ అందించాడు. అయితే పవన్‌ను ప్రభావితం చేసిన వ్యక్తిగా వర్మ కనిపించడం కొసమెరుపు. కాగా, జై పవర్ స్టార్ అంటూ ట్రైలర్‌ను ముగించాడు వర్మ.