పవన్ ఫ్యాన్స్ కు ‘భీమ్లా నాయక్’ మరో గిఫ్ట్..

by Shyam |   ( Updated:2021-10-21 07:48:52.0  )
పవన్ ఫ్యాన్స్ కు ‘భీమ్లా నాయక్’ మరో గిఫ్ట్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా దగ్గుబాటి అభిమానులకు ‘భీమ్లా నాయక్’ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం నుంచి గురువారం ‘బిహైండ్ ది సీన్స్’ పిక్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే రెండు పాటలు, పవన్ కళ్యాణ్, రానా ఇంట్రడక్షన్ వీడియోలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదలైన ఈ స్టిల్‌తో అభిమానులు మరింత ఖుష్ అవుతున్నారు.

క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుండగా.. బ్రేక్‌లో పవన్ నులకమంచం మీద, రానా ఎద్దులబండి మీద పడుకుని సేద తీరుతున్న పిక్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఏ సింప్లిసిటీ అంటూ పొగిడేస్తున్నారు. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను.. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుండగా సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ కానున్న మూవీల పవన్‌కి జోడీగా నిత్యా మీనన్, రానాకు పార్ట్‌నర్‌గా సంయుక్తా మీనన్ నటించబోతున్నారు.

https://twitter.com/SitharaEnts/status/1451115785045217280

Advertisement

Next Story