- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్విట్టర్ ట్రెండింగ్ స్టార్‌గా పవన్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరులో ఉన్న ‘పవర్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘చెప్పిందే చేయడం.. చేసేదే చెప్పడం’ తమ అభిమాన హీరో స్టైల్ అంటూ.. తను చెప్పిందే ఫాలో అయిపోతారు ఫ్యాన్స్. పవనిజం అంటూ ప్రజల్లోకి వెళ్లి జనసైనికుల్లా మారి.. జనసేవ చేస్తున్న అభిమానులు.. తమ సూపర్ హీరో బర్త్ డేకు ముందే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు.
సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కాగా.. ఆయనకు అడ్వాన్స్ బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ పేరిట హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ 24 గంటల్లోనే 27.3 మిలియన్ ట్వీట్స్ సాధించి రికార్డు క్రియేట్ చేయగా.. దేశంలోనే ట్విట్టర్ ట్రెండింగ్ స్టార్‌గా నిలిచారు పవన్ కళ్యాణ్. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
వకీల్ సాబ్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. క్రిష్ డైరెక్షన్‌లో పిరియాడికల్ మూవీ, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.