పవర్ స్టార్ ప్రకటన.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ

by Shyam |
పవర్ స్టార్ ప్రకటన.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ
X

దిశ వెబ్‎డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‎చరణ్‎లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ఆర్ఆర్ఆర్.” ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‎లో రూపొందిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‎తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హిరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, ఓలియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ.. 2021 సమ్మర్‎లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.

తివిక్రమ్ శ్రీనివాస్‎తో తన 30 వ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుత్తం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‎లో మరో సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్‎తో రానుంది. అయితే ఈ సినిమాలు పూర్తయ్యాక దర్శకుడు మెహర్ రమేష్ ఎన్టీఆర్ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. మెహర్ రమేష్‎తో ఎక్కడ కమిటవుతాడో అని టెన్షన్ పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇప్పుడు పవర్ స్టార్ మాటతో హ్యపీ. కారణం మెహర్ రమేష్‎ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడని పవన్ కళ్యాణ్ కన్‎ఫర్మ్ చేశాడు. గతంలో ఆచార్య టైటిల్‎ను చిరంజీవి పొరపాటుగా చెప్పేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed