విద్యుత్​ సమస్యలను పరిష్కరించాలి: కార్పొరేటర్

by Sampath |
విద్యుత్​ సమస్యలను పరిష్కరించాలి: కార్పొరేటర్
X

దిశ, కూకట్​పల్లి: అల్లాపూలర్​ డివిజన్​ పరిధిలోని కాలనీలలో విద్యుత్​ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్​ సబీహా బేగం అన్నారు. డివిజన్​ పరిధిలోని వార్డు కార్యాలయంలో మంగళవారం విద్యుత్​ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ సబీహా బేగం మాట్లాడుతూ.. డివిజన్‌లోని కొన్ని కాలనీలు అయ్యప్ప సొసైటీ సెక్షన్​ పరిధికి వస్తాయని, ఆయా కాలనీలలో విద్యుత్​ సమస్యలు తరచుగా తమ దృష్టికి వస్తున్నాయని ఆమె తెలిపారు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్​ అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఏడీఈ భాగయ్య మాట్లాడుతూ.. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏడీఈ భాగయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story