- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా అంధకారంలోనే..
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు కురిసి 10 రోజులైపోయింది. వరదలు తగ్గి ఐదు రోజులు గడిచిపోయాయి. అయినా గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ కష్టాలు తీరలేదు. ఇంకా ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాల్సి ఉంది. కాలనీల్లో ఇంకా వరద నీరు నిల్వ ఉండడంతో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు పనులు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. వరద నీటిని ఖాళీ చేయాల్సిన సిబ్బంది ఎప్పుడొస్తారో, ఎప్పటికి కరెంటు పనులు మొదలవుతాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పది రోజుల నుంచి చీకట్లలో మగ్గిన ప్రజలంతా ఇంకెన్ని రోజులు కష్టాలు పడాలో తెలియడం లేదంటూ వాపోతున్నారు. నదీమ్ కాలనీ, అల్ జుబైల్ కాలనీ, హఫీజ్ బాబా నగర్, సరూర్‌నగర్‌లోని అయ్యప్పకాలనీ, హబ్సీగూడలోని లక్ష్మీ నగర్, మధురా నగర్, హైదరాబాద్ సెంటర్‌లోని అక్బర్ మసీదు సెంటర్, బాలాజీ భాగ్యనగర్ తదితర మొత్తం పాతిక కాలనీల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది.
నగరంలో మొత్తం 45 కాలనీల్లో పూర్తిస్థాయి అంధకారం నెలకొనడంతో రాత్రి సమయాల్లోనూ పనులు చేసి కొన్ని కాలనీల్లో పాక్షికంగా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించామని, ఇంకా గల్లీల స్థాయిలో ఇవ్వాల్సి ఉందని స్థానిక ఇంజినీర్లు తెలిపారు. పూర్తి స్థాయిలో ఎనిమిది కాలనీల్లో మాత్రం కనెక్షన్లు ఇంకా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కొన్ని అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు ఇంకా నిలిచి ఉంది. కేవలం ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే కాక చాలా చోట్ల కరెంటు స్తంభాలు పడిపోయాయి. వీటిని కూడా సరిచేయాల్సి ఉంది. విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో మొత్తం 1,299 స్తంభాలు దెబ్బతిన్నాయి. దాదాపుగా అన్నింటికీ మరమ్మతు పనులు జరిగినా సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో మొత్తం 1215 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, తాత్కాలికంగా 1,207 చోట్ల మరమ్మతు చేసి ప్రస్తుతానికి విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించామని వివరించారు. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్తంభాలు దెబ్బతింటే అందులో 3,249 చోట్ల మరమ్మతులు జరిగాయి. మరో 15 చోట్ల 33/11 కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి పనులు పూర్తయ్యాయి. వివిధ జిల్లాల పరిధిలోని 1,080 ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లకు కూడా రిపేయిర్ పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అందులో 386 వాటికి మరమ్మతు చేశామని తెలిపారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో 586 ట్రాన్స్‌ఫార్మర్లు మూసీ నదిలో మునిగిపోయాయి.