బిగ్ బ్రేకింగ్.. బిల్లులు పెండింగ్.. ప్రభుత్వ ఆఫీసులకు పవర్ కట్

by Shyam |   ( Updated:2021-11-18 02:00:27.0  )
బిగ్ బ్రేకింగ్.. బిల్లులు పెండింగ్.. ప్రభుత్వ ఆఫీసులకు పవర్ కట్
X

దిశ, జనగామ : విద్యుత్ బకాయిలు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ సరఫరా నిలిపి వేసిన ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విద్యుత్ బిల్లులు చెల్లించని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, ఉపాధి కార్యాలయంతో పాటు పలు జిల్లా కార్యాలయాలకు చెందిన విద్యుత్ బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఆయా సంబంధిత అధికారులకు నోటీసులు అందజేసి గురువారం ఉదయం కార్యాలయాల పనివేళలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో వీధుల్లోకి వచ్చిన అధికారులు చేసేదేమీ లేక మొబైల్ ఫోన్ ద్వారా అప్లికేషన్స్ చేస్తూ వారి పనులలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా జనగామ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, జనగామ పోలీస్ స్టేషన్‌లలో కూడా విద్యుత్ బిల్లులు చెల్లింపులు పూర్తి కాలేదని ఆయా శాఖలకు కూడా నోటీసులు అందించినట్టు అధికారులు తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు వారి పనులు వారు చేస్తున్నారని అధికారులు.. అయినా ప్రజలు అయిన వారికి ఒకటేనని ఈ ఘటనతో తెలియజేశారు.

Advertisement

Next Story