- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోళ్లఫారాల నిర్వాహకులకు గుడ్ న్యూస్
by Shyam |
దిశ, న్యూస్‌బ్యూరో: కోళ్లఫారాల విద్యుత్ బిల్లుల సబ్సిడీకిగాను ప్రభుత్వం రూ.3కోట్ల 11 లక్షలు విడుదల చేసింది. రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని పౌల్ట్రీ ఫాములు 2018-19 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు త్రైమాసికాల్లో వాడుకున్న విద్యుత్‌కు చెల్లించిన బిల్లులను ప్రస్తుతం రీయింబర్స్ చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘పౌల్ట్రీ ఫాములకు సహాయం’ అనే పథకం కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు జీవోలో వెల్లడించారు.
Next Story