డీలిమిటేషన్‌పై KTR మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
డీలిమిటేషన్‌పై KTR మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేష్‌(Delimitation)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగబోతోందని ఆరోపించారు. అసలు దక్షిణాది రాష్ట్రాలు ఏం తప్పు చేశాయని.. కేంద్రం ఇంత కుట్రకు ప్లాన్ చేసిందని మండిపడ్డారు. జనాభా నియంత్రణ పాటించినందుకు సీట్లు తగ్గిస్తారా? అని సీరియస్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గించి.. బీజేపీ(BJP) బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచే కుట్రకు కేంద్రం దిగిందని కీలక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదని.. బీజేపీ మెడలు వంచైనా సరే ఇక్కడ పెంచుకుంటామని అన్నారు.

కాగా, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, అయితే మోడీ ప్రధానమంత్రి(PM Modi) అయ్యాక ఈ అన్యాయం మరింత పెరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ సమస్య కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని, జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీలను నిర్లక్ష్యం చేసింది. బీజేపీ ప్రయోజనాల కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయకపోగా, జమ్మూ కశ్మీర్‌లో మాత్రం అమలు చేసింది. బీజేపీ వంటి పార్టీలు ఈ సమావేశాన్ని దేశ వ్యతిరేకంగా చూపే ప్రయత్నం చేసినా, మేమంతా భారతీయులం, దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం అని నిన్న సమావేశం అనంతరం కేటీఆర్ గుర్తు చేశారు.

Next Story