గోల్డ్ షాప్ లో రూ. 12 లక్షల విలువైన గోల్డ్ దొంగతనం

by Kalyani |
గోల్డ్ షాప్ లో  రూ. 12 లక్షల విలువైన గోల్డ్ దొంగతనం
X

దిశ, జూబ్లీహిల్స్: గోల్డ్ కొనేందుకు వెళ్లినట్టు వెళ్లి ఓ గోల్డ్ షాప్ లో 12 లక్షల విలువైన నగలు దొంగతనం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయవాడ , కృష్ణా జిల్లాకు చెందిన పడమట వినాయక్ (29) పెళ్లి అయ్యి, ఒక పాప ఉంది. విశాఖపట్నంలోని ఓ ఫార్మా ల్యాబ్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ గా , ఇంకా వేరే సంస్థలలో పని చేసిన అక్కడ జీతం తక్కువ రావటం తో ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ వృత్తిలో స్థిరపడాలని వచ్చాడు. హైదరాబాద్ యూసఫ్ గూడ , ఎల్,ఎన్ నగర్ లో తన స్నేహితుడి ఇంటికి మకాం మార్చాడు. గత ఫిబ్రవరి నెల లో వినాయక్ తన కూతురికి బంగారు ఆభరణాలు కోనాలని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 లోని ఎస్. కే. టీ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ కి వచ్చాడు. నగలు కొనేంత డబ్బు లేకపోవటం తో తన రూం కి వెళ్ళిపోయాడు.

అయితే సులభంగా డబ్బు సంపాదించాలని వినాయక్ పథకం ప్రకారం మార్చి 24, సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో వినయ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 లోని ఎస్. కే. టీ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ లోకి వెళ్లి, సేల్స్ మెన్ నీ కొన్ని కూతురికి బంగారు వడ్డాణాలు చూపించమని అడిగాడు. కొన్ని వడ్డాణాలలో ఒకటి తనతో తీసుకొచ్చిన బ్యాగ్ లో వేసుకుని తర్వాత తీసుకుంట తగిన నగదు లేదని వినాయక్ వెళ్ళిపోయాడు. కాసేపటికి షాప్ లో ఒక బంగారు ఆభరణం కనిపించకపోవడం తో వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేసిన సేల్స్ మెన్ కి అసలైన విషయం బయటపడింది. వినాయక్ తన బ్యాగ్ లో 130 గ్రాముల బంగారు ఆభరణం దొంగిలించినట్లు గుర్తించి, వెంటనే అప్రమత్తం అయ్యి సీసీ ద్వారా మెట్రోలో ప్రయాణించిన వినాయక్ జాడ కోసం జ్యువెలరీ షాప్ సిబ్బంది వెతకగా మాదాపూర్ మెట్రో స్టేషన్ వద్ద వినాయక్ పట్టుబడ్డాడు. తన బ్యాగ్ లోని 12 లక్షల విలువైన బంగారు ఆభరణం స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి, ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story