- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
EPF: మే లేదా జూన్ నుంచి ఏటీఎం, యూపీఐల నుంచి పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నిధుల ఉపసంహరణను సులభతరం చేస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక సంస్కరణలు తీసుకురానుంది. ఈ ఏడాది మే లేదా జూన్ నెల నుంచి యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) పంపిన ప్రతిపాదనలు కార్మిక శాఖ ఆమోదించింది. ఈ విషయాన్ని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా చెప్పారు. ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని ద్వారా పీఎఫ్ నిధులను తీసుకునే విషయంలో ఉద్యోగులు కీలక మార్పులను చూడనున్నారు. పీఎఫ్ నగదును తీసుకోవడమే కాకుండా పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయాన్ని యూపీఐ ద్వారా చూసుకునే సదుపాయం కూడా ఉంటుందని ఆమె వివరించారు. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా తక్షణం రూ.1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తమకు కావాల్సిన అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చని సుమిత్రా తెలిపారు. ఈ స్పష్టమైన మార్పుల ద్వారా ఉద్యోగులు అనారోగ్య కారణాలతో పాటు గృహనిర్మాణం, విద్య, వివాహం కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని ఆమె పేర్కొన్నారు.