- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వెనక్కి తగ్గని ఎంకే స్టాలిన్

- హిందీ ఇంపోజిషన్‌పై కొనసాగుతున్న నిరసన
- త్వరలోనే కీలక ప్రకటన
- ద్విభాషా విధానం కొనసాగింపు
- వెల్లడించిన స్టాలిన్
దిశ, నేషనల్ బ్యూరో: హిందీ భాషను బలవంతంగా రుద్దడం, రాష్ట్రంపై ఆర్థిక వివక్షను పాటించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ద్విభాషా విధానంపై తమిళనాడు రాజీ పడదని.. త్వరలో ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్ట చర్యలతో కూడిన ప్రకటనను వెలువరిస్తానని స్టాలిన్ సూచన ప్రాయంగా చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో భాషా విధానంపై మంగళవారం అటెన్షన్ మోషన్‌పై జరిగిన చర్చలో స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమిళం, ఇంగ్లీషు మాత్రమే అధికార భాషలుగా ఉంటాయని పునరుద్ఘాటించారు. ఈ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, తమిళనాడు వ్యవహారాలకు తమిళం, ఇంగ్లీష్ సరిపోతాయని ఆయన నొక్కి చెప్పారు. హిందీ అభ్యాసానికి సంబంధించిన ఆర్థిక ప్రోత్సాహకాలను తాను తిరస్కరించిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. కేంద్రం నిధుల విడుదలను హిందీ నేర్చుకోవడానికి అనుసంధానిస్తే ఆ డబ్బు అవసరం లేదని స్టాలిన్ చెప్పారు.
రూ.10 వేల కోట్లు ఇచ్చినా ఈ త్రిభాషా విధానాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. ఈ అంశం తమిళ సంస్కృతి, యువత, గుర్తింపును రక్షించడానికి సంబంధించిందని స్టాలిన్ అన్నారు. 1968లో అప్పటి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై ద్విభాషా విధానాన్ని ప్రవేశపెట్టారని.. దాన్ని మార్చడం కుదరదని అన్నారు. మేం ఏ భాషకు కూడా వ్యతిరేకం కాదు. కానీ తమిళాన్ని అణచి వేయడానికి ఉద్దేశించిన ఏ ఆధిపత్య భాషను కూడా అంగీకరించబోమని స్టాలిన్ చెప్పారు. ఈ అంశంలో తమిళనాడు ధృఢమైన వైఖరిని పొరుగురాష్ట్రాలు సరైన విధానంగా గుర్తిస్తున్నాయని స్టాలిన్ అన్నారు. సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యం కోసం కేంద్రం భాషను రుద్దడాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని స్టాలిన్ ఆరోపించారు. ఇలాంటి చర్యలు సమాఖ్యవాదం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై దాడిగా స్టాలిన్ అభివర్ణించారు. తమిళనాడు హక్కులను కాపాడుకోవడానికి త్వరలోనే నిర్ణయాత్మక చర్య తీసుకుంటామని స్టాలిన్ చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు కే.పళనిస్వామి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ భాషా విధానంపై కేంద్రంతో చర్చించాలని స్టాలిన్ కోరారు.