Finance bill: ఫైనాన్స్ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. 35 సవరణలతో ఆమోదించిన సభ

by vinod kumar |
Finance bill: ఫైనాన్స్ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. 35 సవరణలతో ఆమోదించిన సభ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక బిల్లు 2025కు లోక్‌సభ (Loke sabha) ఆమోదం తెలిపింది. 35 సవరణలతో కూడిన ఈ బిల్లును ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం సీతారామన్ సవరణలను ప్రతిపాదించగా అందుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సవరణల్లో ప్రధానంగా ఆన్ లైన్ ప్రకటనలపై 6శాతం డిజిటల్ పన్నును రద్దు చేయడం, గూగుల్ టాక్స్ నుంచి ఉపశమనం కల్పించడం వంటివి ఉన్నాయి. అనంతరం బిల్లును రాజ్యసభకు పంపనున్నారు. ఎగువ సభ ఆమోదం పొందిన తర్వాత 2025-26 బడ్జెట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ చట్టం ప్రజల ఆకాంక్షలకు, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉందని సీతారామన్ తెలిపారు. పన్నుల విషయంలో స్పష్టత కల్పించడం, వ్యాపారం సులభతరం చేయడానికి నిబంధనలను హేతుబద్ధీకరించడం, టాక్స్ రిలీఫ్ కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం లభించిందని కాగా, ఈ ఏడాది ప్రభుత్వం మొత్తం రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 7.4శాతం ఎక్కువ.

డిజాస్టర్ అమెండ్‌మెంట్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం అన్ని విపత్తులను మెరుగ్గా నిర్వహించడంలో రాష్ట్రాలకు సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును గతేడాది డిసెంబర్‌లో లోక్ సభ ఆమోదించగా మంగళవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ అంశంపై విపక్ష సభ్యులు ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రతిపాదిత సవరణలు రూపొందించామని తెలిపింది.

Next Story

Most Viewed