- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR: ఈ సయమంలో అందాల పోటీలు అవసరమా?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 480 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడ్డారని, వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణపై చర్యలు చేపట్టకుండా అందాల పోటీలు నిర్వహిస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్సయిజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా రూ.700 కోట్లా ఆదాయం వచ్చిందని, రూ.46 కోట్ల ఖర్చు చేస్తే రాద్ధాంతం చేసి రేస్ నిర్వహణ జరగకుండా చేశారని, ఇప్పడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఆదాయం ఎలా వస్తుందో, కొలువులు ఎలా వస్తాయో పర్యాటక శాఖ మంత్రి వివరించాలని అన్నారు.
మిస్ యూనివర్స్, మిస్ యూనివర్స్ అవుట్ డేటెడ్ అయ్యాయిని అన్నారు. ఇదే మంత్రి, బీఆర్ఎస్ హయంలో పర్యాటక మంత్రిగా ఉన్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహనికి ఎప్రిల్ 14 నుంచి అయినా పర్యటకులు ఆహ్వానించాలని అన్నారు. అమరవీరుల జ్యోతిని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ హయంలో రామప్పకు యూనిస్కో గుర్తింపు వచ్చిందని ఆ దిశగా కేంద్రానికి లేఖ రాసి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. పర్యాటక అభివృద్ధి చేపడుతున్నామన్న రంగనాయక సాగర్, పోచంపాడు, మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగంగా నిర్మించినవేనని గుర్తు చేశారు. మేము ఓఆర్ఆర్ టీవోటీ పద్దతిలో 33 సంవత్సారా లీజ్ కు ఇస్తే ప్రశ్నించిన వారు, ఇప్పుడు పర్యాటక శాఖకు చెందిన భూములను 99 సంవత్సారాల లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.