యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా

by Shamantha N |
యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా
X

భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా మారడంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేది తర్వాతే పరీక్ష షేడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని యూజీసీ సర్క్యులర్ ఆదేశించింది. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని, ప్రతీ వర్సిటీ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్‎ను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది.

tag: U.G.C orders, Postponement, Universities, Exam Schedule

Advertisement

Next Story