ఉద్యోగులే పిటిషన్ వేస్తే ఎలా?

by Anukaran |   ( Updated:2020-07-25 10:07:46.0  )
ఉద్యోగులే పిటిషన్ వేస్తే ఎలా?
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు అనుమతి ఇచ్చే పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కూల్చివేత కవరేజ్ చేయడానికి ఒక ఉద్యోగి పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వొకేట్ జనరల్ ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వివరించారు. కంపెనీ భాగస్వాములు కాకుండా ఉద్యోగులు పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కంపెనీ భాగస్వాములు ఈ విచారణలో ఇంప్లీడ్ అయ్యేలా మరో పిటిషన్ దాఖలు చేయడానికి గడువు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సమ్మతించిన డివిజన్ బెంచ్ సోమవారం లోపు ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed