దేవినేని ఉమా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by srinivas |
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దేవినేని ఉమా తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఉమా మహేశ్వరరావుపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని న్యాయవాది పోసాని వాదించారు. ఈ కేసులో ఎవరికీ గాయాలు కాలేదని.. హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని వాదించారు. అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహతుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ అని తెలిపారు.

దేవినేని ఉమాకు డ్రైవర్ కులం తెలిసే అవకాశం లేనేలేదని వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే ఆయన్ను ఈ కేసులో ఇరికించారని వాదించారు. అయితే కేసు విచారణ జరుగుతుందని, మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి దశలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని వాదించారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

Next Story