చారగొండ సత్యానికి పూలె జాతీయ సేవ అవార్డు..

by Shyam |   ( Updated:2021-10-26 21:53:15.0  )
చారగొండ సత్యానికి పూలె జాతీయ సేవ అవార్డు..
X

దిశ, అచ్చంపేట : కరోనా టైంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ జాగృతి నాయకుడు చారగొండ సత్యానికి అరుదైన గౌరవం లభించింది. ఆయనకు మంగళవారం పూలె జాతీయ సేవ అవార్డును రవీంద్రభారతిలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా సేవలను గుర్తించిన నేస్తం జాతీయ స్వచ్చంద సేవ సంస్థ వారు పూలె జాతీయ సేవ పురస్కారం అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ అవార్డును అందజేసిన తెలంగాణ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు, సినీ రచయిత ప్రసన్న కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ టిజి లింగం గౌడ్‌లకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర, తెలంగాణ రియల్ హీరో సుమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed