- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా డ్రీమ్.. బుట్ట బొమ్మ పూజా

దిశ, సినిమా: ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుట్ట బొమ్మ.. తాజాగా తనకు ఎప్పటినుంచో మిగిలిపోయిన కోరిక, కల నేరవేరిందని తెలిపింది. ఈ మేరకు తన కోరికల లిస్ట్‌లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ టిక్ పెట్టుకుంటున్నానని తెలిపిన నటి.. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘లెజెండ్ అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా డ్రీమ్.
ఈ రోజుతో నా కలల లిస్ట్‌లో ఇది పూర్తయినట్లుగా టిక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశాను. మరింత తెలుసుకోవడానికి వెయిట్ చేయండి’ అని పోస్ట్ చేసింది. ఇక ఈ పిక్‌లో బిగ్ బి పెద్ద మీసాలతో సీరియస్‌గా చూస్తున్నట్లు కనిపించగా.. పూజా చాలా ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ కనిపించింది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ కాగా ఇద్దరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.