- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ వ్యాధితో నరకం అనుభవిస్తున్న నటి.. పరువు పోతుందని !

దిశ, వెబ్ డెస్క్: తనకు టీబీ జబ్బు ఉందని షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని ( Suhasini Maniratnam). ఈ టీబీ జబ్బు ( TB ) కారణంగా.. చాలా రోజుల నుంచి బాధపడుతున్నానని...కానీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా దాచి ఉంచినట్లు ఆమె తెలిపారు. దీంతో నటి సుహాసిని కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నటి సుహాసిని ( Suhasini ).. తన ఆరోగ్యం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తనకు టీవీ జబ్బు ఉండేదని ఆమె గుర్తు చేశారు. ఈ జబ్బు గురించి ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని భయంతో రహస్యంగా చికిత్స తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
అలా సీక్రెట్ గా దాదాపు ఆరు నెలల పాటు వైద్యం తీసుకున్నట్లు.. తాజా ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని స్పష్టం చేశారు. తాను రెండుసార్లు టిబి జబ్బు బారిన పడ్డానని ఆమె వెల్లడించారు. తాను ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు అలాగే 36 సంవత్సరాల వయసు లో... ఈ జబ్బు బారిన పడ్డట్లు క్లారిటీ ఇచ్చారు సుహాసిని. ఆ సమయంలో విపరీతంగా బరువు కూడా తగ్గి... వినికిడి శక్తి కూడా కోల్పోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంచి వైద్యం తీసుకోవడం వల్ల కోలుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం టీవీ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో నటి సుహాసిని వ్యాధి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.