- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Heavy Rain Alert: విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడ(Vijayawada)లో ఈ రోజు(గురువారం) ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rain) కురిసింది. ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవ్వగా.. ఈదురు గాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో కరెంట్ తీగలు తెగి పోయినట్లు సమాచారం. ఈ క్రమంలో రాగల మూడు గంటలు నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(AP Disaster Management Authority) హెచ్చరించింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని సూచించింది.