Kakani: మూడోసారి.. సీన్​ రిపీట్​! విచారణకు కాకాణి డుమ్మా

by Anil Sikha |
Kakani: మూడోసారి.. సీన్​ రిపీట్​! విచారణకు కాకాణి డుమ్మా
X

దిశ, డైనమిక్​ బ్యూరో: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి (Ex minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు. మూడోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. బుధవారం ఆయన హైదరాబాద్​లో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న ఆయన పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. ఈ రోజు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే మరోసారి ఆయన విచారణకు రాలేదు. ఇప్పుడు మూడవ సారి కూడా కాకాణి విచారణకు రాలేని నేపథ్యంలో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.



Next Story

Most Viewed