మెగాస్టార్ మూవీలో బుట్టబొమ్మ?

by Shyam |   ( Updated:2020-12-26 00:51:45.0  )
మెగాస్టార్ మూవీలో బుట్టబొమ్మ?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజా హెగ్డే.. గుణశేఖర్ దర్శకత్వంలో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ బుట్ట బొమ్మ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించబోతుందన్నది లేటెస్ట్ న్యూస్. చిరు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో పాత్రలో పూజ కనిపించనుందని టాక్.

ఆచార్యలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండగా.. జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెర మీదకు వచ్చింది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే చెర్రీ సరసన కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజను ‘ఆచార్య’ మూవీ యూనిట్ సంప్రదించిందని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story