హగ్ చేసుకుంటూ.. ముచ్చట్లు చెప్పుకుంటూ..

by Shyam |
హగ్ చేసుకుంటూ.. ముచ్చట్లు చెప్పుకుంటూ..
X

పూజా హెగ్డే సినిమా కెరియర్ పీక్స్‌లో ఉంది. మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో, హౌజ్ ఫుల్ 4 ఇలా వరుస విజయాలు అందుకున్న పూజా.. ఇటు సౌత్ ఇండస్ట్రీ, అటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఉంది ఈ భామ. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్న పూజ .. తన కుకింగ్ అండ్ గిటార్ స్కిల్స్‌కు మెరుగులు దిద్దే ప్రయత్నం చేసింది. డోర్ లాక్ అయి ఓ రూమ్‌లో ఫ్యామిలీ లాక్ అయిపోయిన విషయం నుంచి తండ్రి మ్యూజిక్ స్కిల్స్ ప్రదర్శన వరకు ప్రతీ విషయాన్ని అభిమానులతో షేరు చేసుకున్న పూజా.. తాజాగా తనకు చాలా ఇష్టమైన వ్యక్తితో గడుపుతున్నాను అంటూ పోస్ట్ పెట్టింది.

తను అంతగా ప్రేమించే వ్యక్తి మరెవరో కాదు తన నానమ్మ. తనను హగ్ చేసుకుంటూ.. ముచ్చట్లు చెప్తున్న ఫొటోలు షేర్ చేసిన పూజా… నా బంగారం అంటూ నానమ్మను ముద్దు చేస్తోంది. గుండు, అజ్జి, క్యూటీ అని పిలుచుకునే నానమ్మ లాక్ డౌన్ సడలించడంతో ఇంటికి విచ్చేయడంతో పండగ చేసుకుంటుంది పూజా. కాగా ఈ బ్యూటీఫుల్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ కలిసి ఉన్న ఫొటోకు తెగ లైక్‌లు పడిపోతున్నాయి.

Advertisement

Next Story