మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ‘పూజ’

by Jakkula Samataha |
మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ‘పూజ’
X

దిశ, వెబ్‌డె‌స్క్ : బ్యూటిఫుల్ పూజా హెగ్డే మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. డైరెక్టర్ రోహిత్ శెట్టి, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సర్కస్’ మూవీలో ఫిమేల్ లీడ్‌గా చాన్స్ అందుకుంది. ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ నవల ఆధారంగా తెరకెక్కిన ‘అంగూర్’ సినిమా రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా సెలక్ట్ అయింది.

టీ సిరీస్ సమర్పిస్తున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ అసోసియేషన్‌తో కలిసి రోహిత్ శెట్టి స్వయంగా నిర్మిస్తుండగా.. రణ్‌వీర్ డ్యూయల్ రోల్‌లో సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింబా’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. సర్కస్‌పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్. నవంబర్‌లో ముంబైలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది శీతాకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Next Story

Most Viewed