'ఆ సర్పంచుల వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం'

by Shyam |
ఆ సర్పంచుల వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం
X

దిశ, వరంగల్: గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని చెరువులన్నింటినీ ఆయా గ్రామాల మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కే లీజుకిచ్చేలా గ్రామ స‌ర్పంచుల‌కు ఆదేశాలివ్వాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు బండా ప్ర‌కాశ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఆయన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావుకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. 1964లో చేసిన కో-ఆప‌రేటివ్ చ‌ట్టం కానీ, 1978లో రూపొందించిన 343 జీవో కానీ, 1999లో ఇచ్చిన 546 జీవో ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంద‌న్నారు. 100 ఎక‌రాలపై బ‌డిన‌, లోబ‌డిన రెండు విభాగాలుగా చెరువుల‌ను విభ‌జించార‌ని, అప్ప‌టికే ఏర్ప‌డి ఉన్న మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కే 100 ఎక‌రాల లోపు ఉన్న చెరువుల‌ను లీజు కివ్వాల్సి ఉంద‌న్నారు. అయితే, సూర్యాపేట జిల్లా ఆత్మ‌కూరు (ఎస్) మండ‌లం నిమ్మిక‌ల్లు, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండ‌లం కొదుమూరు, గ‌ట్టు సింగారం, ర‌ఘునాథ‌పాలెం, మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి, మ‌రిపెడ మండ‌లం వీరారం, రాయ‌ప‌ర్తి మండ‌లం కొత్తూరు గ్రామాల్లో స‌ర్పంచులు మ‌త్స్య‌స‌హ‌కార సంఘాల‌కు చెరువులు లీజుకివ్వ‌లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో మ‌త్స్య కారుల‌ను ఆదుకోవాల‌ని నిర్ణ‌యించి, చెరువుల్లో కోట్లాది చేప పిల్ల‌ల‌ను వేసి ఆదుకుంటుంటే కొంద‌రు స‌ర్పంచులు ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. ఆయా గ్రామాల స‌ర్పంచుల వ‌ల్ల చ‌ట్టాలు అమ‌లు కాక‌పోవ‌డమే కాకుండా ఆ గ్రామాల్లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని ఎంపీ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story