ఏడాదిలో మూడోసారి ఎన్నికలు

by Shamantha N |
ఏడాదిలో మూడోసారి ఎన్నికలు
X

టెల్‌అవివ్ : ఇజ్రాయెల్‌లో ఏడాది కాలంలో మూడోసారి ఎన్నికలు జరిగుతున్నాయి. సోమవారం రోజున మూడోసారి ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్‌లకు చేరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైట్ వింగ్ లుకిడ్ పార్టీ చీఫ్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆర్మీ మాజీ చీఫ్ బెన్ని గ్యాంట్జ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒపీనియన్ పోల్స్‌లో వీరిద్దరి పార్టీలు, కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్టు తెలిసింది. గతేడాది సెప్టెంబర్, ఏప్రిల్‌లో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఇరుపక్షాలకు మధ్య స్వల్ప తేడాతో ఫలితాలు వచ్చాయి. రెండు పక్షాలూ ఇతర చిన్నచిన్న పార్టీలతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. కాగా, సోమవారం మూడోసారి జరుగుతున్న ఎన్నికల ఫలితాలూ అదే తరహా పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని చూపించుకోకుంటే.. మరోసారి అంటే నాలుగోసారీ ఎన్నికలు జరుగొచ్చని చెబుతున్నారు.

tags : Israel, third elections, Benjamin Netanyahu, benny gantz, deadlock

Advertisement

Next Story

Most Viewed