- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ నాయకా.. ఇదేం తిట్ల దండకం!
దిశ, ఆదిలాబాద్: అత్త మీద కోపం దుత్త మీద చూపడమంటే ఇదేనేమో! అధికార పార్టీలోని ఒక నేతపై ఉన్న కోపాన్ని తిట్ల రూపంలో ఓ జర్నలిస్టు మీద చూపించాడు అదే పార్టీకి చెందిన మరోనేత. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సెల్‌ఫోన్లు సదరు తిట్ల పురాణమే రింగ్‌టోన్‌గా మోగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ఓ రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ అగ్రనేతల నడుమ కొంతకాలంగా పొసగడం లేదు. వీరిలో ఒకరు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరొకరు జిల్లాస్థాయి నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో నామినెటెడ్ నేతకు సంబంధించిన కార్యక్రమాలను ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు కవర్ చేయడాన్ని, ‘చట్టసభల నేత’ తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సదరు జర్నలిస్టు.. ‘‘సార్ నమస్తే, రేపు మన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉంది కదా ఒక యాడ్ కోసం ఫోన్ చేస్తున్నాను’ ’ అని ‘చట్టసభల నేత’తో అన్నారు. బదులుగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ 23వ వార్డులో 15 మందికి పంచగానే(…)గాడు ఏదో చేసినట్టు కవర్ చేశావు, నీ అ.. నేను చేసేది కనిపించలేదా! అంటూ దూషణల పర్వానికి దిగారు. ఆ విలేకరి ఏదో సర్దిచెప్పబోతుండగా మరోసారి ‘‘నీ య.. ఫాల్తూ పెట్టెయ్… ’’ అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ జర్నలిస్టు విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తూర్పు జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కూడా ఫిర్యాదు చేశారు. సంబంధిత వాయిస్ రికార్డును నేతలందరికీ పంపారు. దీంతో తేరుకున్న సదరు ‘చట్టసభల నేత’ ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చూడాలని పార్టీలోని మిగతా నేతలను వేడుకుంటున్నారు. జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జిల్లాకు చెందిన సహచర జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Tags: adilabad, journalist, politicians, ring tones