- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాళేశ్వరంలో రూ.70 వేల కోట్ల అవినీతి: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అదొక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అవినీతిని బయటపెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ అవినీతిని యావత్ దేశానికి తెలియజేసేందుకు తమ పార్టీ నేతలతో కలిసి మంగళవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహిస్తున్నట్లు షర్మిల స్పష్టంచేశారు. రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన సీఎం కేసీఆర్ తొలుత 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి.. లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తున్నారని ఆమె విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేని ప్రాజెక్టని ఆమె పేర్కొన్నారు. రూ.లక్షా 20 వేల కోట్లను అనవసరంగా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రాజెక్టు విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటినే కాళేశ్వరం లెక్కల్లో చూపిస్తున్నారన్నారు. మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టు ఇస్తే కమిషన్ వస్తుందనే అతడికి ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా 20 వేల కోట్లకు అంచనాలు పెంచడంలో అవినీతి లేదా? అని షర్మిల ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే ఎవరికీ కనిపించడం లేదా? అని దీనిపై విచారణ చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నలవర్షం కురిపించారు. కట్టిన మూడేండ్లకే కాళేశ్వరం మునిగిపోయిందని, కనీసం పంప్ హౌస్ ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని ఆమె ధ్వజమెత్తారు. కేవలం విద్యుత్ చార్జీల కోసమే రూ.3 వేలకోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతియేటా లోన్లను రిపేమెంట్ చేయడానికే రూ.13 వేల కోట్ల అవసరం ఉంటుందన్నారు.
ప్రజలు కట్టిన పన్నుతో ప్రాజెక్టును నిర్మించారని, కట్టిన సంస్థకు కనీసం గ్లోబల్ టెండరింగ్ కూడా లేదన్నారు. 80 శాతం ప్రాజెక్టులు ఒకే కాంట్రాక్టర్ కు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రశ్నించకుండా ఆయన డబ్బులు తీసుకొని లొంగిపోయారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ అంశంపై ఏమీ మాట్లాడటం లేదని, దీన్నిబట్టి బీజేపీ కూడా ముడుపులు తీసుకుంటుందని అనుకోవాలా? అని ఆమె పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేయడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. ఇదిలాఉండగా మంగళవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో షర్మిల సోమవారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లనున్నారు.