విజయవాడ పర్యటనలో వైఎస్ షర్మిల.. పొలిటికల్ పార్టీలపై ఫైర్

by Indraja |   ( Updated:2024-04-25 07:37:58.0  )
విజయవాడ పర్యటనలో వైఎస్ షర్మిల.. పొలిటికల్ పార్టీలపై ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల ప్రచారంలో బాగంగా నేడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైసీపీని నిలదీశారు. నేడు రాష్ట్రానికి రాజధాని కూడా లేదని.. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి అని, ఈ పరిస్థితికి అధికార పార్టీ, టీడీపీనే కారణం అని ధ్వజమెత్తారు.

నాడు చంద్రబాబు ఆంధ్ర మరో సింగపూర్ అవుతుందని అన్నడు అని ఆమె తెలిపారు. 3d గ్రాఫిక్స్ చూపించి, 30 వేల ఎకరాలు తీసుకున్నారని ఆరోపించారు. అలానే 2015లో మోడీ వచ్చి భూమి పూజ చేశాడని.. యమునా నది నుంచి మట్టి కూడా తెచ్చాడని.. చివరికి మనకి మట్టే మిగిల్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డిల్లీని తలదన్నే రాజధాని ఉండాలని మోడీ, ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధాని అని, సింగపూర్ లాంటి రాజధాని కడతానని బాబు ప్రగల్బాలు పలికారని, చివరికి అమరావతి కాస్త భ్రమరావతి అయ్యిందని ఎద్దేవ చేశారు.

హైదరాబాద్ నేనే కట్టాను అని చెప్పుకునే బాబు, హైదరాబాద్‌ను మించిన రాజధానిని మళ్ళీ కడతానని చెప్పాడు. కానీ బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్పా మిగిలింది ఏమి లేదు అని విమర్శించారు. ఇక నాడు చంద్రబాబు దేశ విదేశాలు తిరిగాడు తప్పా పెట్టుబడులు మాత్రం రాలేదని ఎద్దేవ చేశారు. ఫలితంగా ఉద్యోగాలు లేవు..పరిశ్రమలు లేవు అని ఆరోపించారు.

ఇక జగన్మోహన్ రెడ్డి తాను గెలిస్తే ఆంధ్ర మరో వాసింగ్ టన్ dc అవుతుందని గాల్లో మెడలు కట్టారని ఆమె ఎద్దేవ చేశారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటి కాదు మూడు రాజధానులు కడతానని చెప్పిన జగన్ ఒక్కటన్నా కట్టాడా అని ప్రశ్నించారు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి కూడా దిక్కులేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని మండిపడ్డారు.

రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే... మళ్ళీ వాళ్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ మోసం చేస్తే నిలదీసే దమ్ము ఒక్కరికి కూడా లేదని దుయ్యబట్టారు. ఈ సారి బాబుకి ఓటు వేసినా, జగన్‌కి వేసినా డ్రైనేజీలో వేసినట్లే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనకు రాజధాని కావాలి అంటే.. పోలవరం కట్టాలి అంటే.. కాంగ్రెస్ రావాలి. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు, కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి అని ఆమె తెలిపారు.

Advertisement

Next Story