ఆ ఇద్దరి చేతుల్లో జగన్ రిమోట్ కంట్రోల్.. వాళ్ళెవరో కూడ చెప్పిన వైఎస్ షర్మిల

by Indraja |   ( Updated:2024-04-30 15:30:35.0  )
ఆ ఇద్దరి చేతుల్లో జగన్ రిమోట్ కంట్రోల్.. వాళ్ళెవరో కూడ చెప్పిన వైఎస్ షర్మిల
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అన్నాచెల్లెల్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత అన్నాచెల్లెల్లు అయినప్పటికీ ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. బహిరంగ సభల్లో ఒకరిపై ఒకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు.

తాజాగా మరోసారి వైయస్ షర్మిల తన అన్నమయ్య జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అని వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. రిమోట్ కంట్రోల్ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా అవగాహణ ఉందని ఆమె ఎద్దేవ చేశారు.

గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ తన ఇంట్లో వాళ్లతో పాటుగా కేంద్రంలో నరేంద్ర మోడీ చేతుల్లో ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసే ఇద్దరి పేర్లు కూడా Bతోనే ప్రారంభమవుతాయి అని ఆమె పేర్కొన్నారు. అయితే భారతి అలానే బీజేపీని ఉద్దేశించి షర్మిల జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసే ఇద్దరి పేర్లు కూడా Bతోనే ప్రారంభమవుతాయి అని అన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ బిడ్డ ఆయన తనను ప్రజలు ఆదరించి గెలిపించకపోతే నేరం గెలిచినట్లే అని ఆమె అన్నారు. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అని పేర్కొన్నారు. అలానే వైఎస్ఆర్ పేరును చార్జ్‌షీట్‌లో చేర్చింది కాంగ్రెస్ అని ఆరోపిస్తున్న వైసీపీపై ఆమె మండిపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో వైఎస్ఆర్ పేరు లేదని స్పష్టం చేశారు.


Read More...

మోడీ ఫొటో లేకపోవడానికి రీజన్ ఇదే.. TDP మేనిఫెస్టోపై జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story