ఎన్నికలే లక్ష్యంగా ‘సోషల్’ యుద్ధం.. వారిపై విష ప్రచారానికి 40 ఛానళ్లు!

by GSrikanth |
ఎన్నికలే లక్ష్యంగా ‘సోషల్’ యుద్ధం.. వారిపై విష ప్రచారానికి 40 ఛానళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వైఎస్‌‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచే దమ్మున్న ముఖ్య నేతలను ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అంతేకాదు.. పార్టీలోని అసంతృప్తులు బయటకు వెళ్లకుండా స్వయంగా సీఎం బుజ్జగించడంతో పాటు గెలుపు అవకాశాలున్న ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు విడుదలైన అన్ని సర్వేల్లో జగన్‌కు ఎదురుగాలి తప్పదని తేలడంతో సిట్టింగులను మారుస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఎన్నికలకు మరికొంత సమయమే ఉండటంతో వీలైనంత మేరకు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. విమపక్షాలపై విమర్శలు చేయాలని పదికి పైగా వెబ్‌సైట్లు, 40 యూట్యూబ్ ఛానళ్లు, 200 లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలను పార్టీ సోషల్ మీడియా టీమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఛానళ్లలో ఏం ప్రసారం కావాలో.. ఇన్‌స్టా, వెబ్ పేజీల్లో ఏం పోస్టు కావాలో కంటెంట్ మనమే ఇవ్వబోతున్నామని ఏకంగా ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సొంత పార్టీ నేతలకు చెప్పడం కలకలం రేపుతోంది. 30 నుంచి 40 యూట్యూబ్ ఛానళ్లు, 10 నుంచి 15 వెబ్‌సైట్లు, 200 లకు పైగా ఇన్‌స్టా పేజీలను కొనుగోలు చేశామని భార్గవరెడ్డి సొంత నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన టీడీపీ, జనసేన ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్ ఓటమి ఖరారు అయిందని చెబుతున్నారు.

Advertisement

Next Story