పవన్ కల్యాణ్, బాలకృష్ట కలయికపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు..

by Hamsa |
పవన్ కల్యాణ్, బాలకృష్ట కలయికపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం 'వీరసింహారెడ్డి' మూవీ షూటింగ్ సెట్‌లో సందడి చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా, ఈ ఫొటోపై వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గుర్రంపాటి దేవేంద్రా రెడ్డి తీవ్ర విమర్షలు చేశారు. ''గతంలో ఆధిపత్య పోరు కోసం మీలో మీరు గొడవపడ్డారు. ఇప్పుడు అవసరాల కోసం సిగ్గు లేకుండా కలిసి తిరుగుతున్నారు. మీరూ బతుకుతున్నారు బురదలో దొర్లే.. బతుకుతున్నాయి''. అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు దేవేంద్రా రెడ్డితో పాటు జగన్‌‌పై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Next Story