- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్లపై కేసీఆర్ వ్యూహం ఫలించేనా..? ఆ అంశంపై నో క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రిజర్వేషన్లు 64 శాతానికి పెరిగాయి. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నాలుగు శాతం పెరిగింది. ఎస్టీల రిజర్వేషన్లపై జీవో జారీచేసిన సర్కారు.. 2017లో ప్రకటించిన ముస్లిం రిజర్వేషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎస్టీలకు 10 రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూపుతోంది. నోటిపికేషన్లకు అంతా రెడీ చేసిన ఆర్థిక శాఖ, టీఎస్పీఎస్సీ ఇప్పుడు మళ్లీ కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో పిటిషన్లు పడితే.. ఇటు ఉద్యోగాలకు, అటు గిరిజనులకు కష్టకాలమే. నోటిఫికేషన్లపై ముందుకు వెళ్లేందుకు బ్రేక్పడినట్టే. అయితే, దీనిపై కేంద్రం అనుమతి అవసరం లేదంటూ అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ, ఇదే అంశంపై సీఎం కేసీఆర్.. కేంద్రానికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో 64 %
రాష్ట్రంలో రిజర్వేషన్లు 64 శాతంగా మారాయి. బీసీలకు 25శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, మైనార్టీలకు 4శాతం ఉన్నాయి. దీంతో 54 శాతం రిజర్వేషన్లకు అదనంగా కేంద్రం అమలు చేస్తున్న ఈడబ్ల్యుఎస్10 శాతం రిజర్వేషన్లు కూడా ఉంటున్నాయి. దీంతో మన రాష్ట్రంలో 64 శాతానికి పెరిగాయి. తాజాగా ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి జీవో జారీ చేసింది. విద్య, ఉద్యోగావకాశాల్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆ జీవోతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
ఆరేండ్ల నుంచి..!
రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తమిళనాడు తరహాలో.. 2016 ఏప్రిల్‌లో బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అప్పట్నుంచి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై విమర్శలు చేస్తూనే ఉంది. రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులతో పాటు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తెచ్చింది. ముస్లింమైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించారు. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతాన్ని 12కు, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 64కు పెంచుతూ 2017 ఏప్రిల్ 16న బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండడంతో తమిళనాడు తరహాలో బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోడీతోనూ రిజర్వేషన్ల పెంపు విషయమై సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పలుమార్లు చర్చించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఆటంకాలు లేవని రాజ్యాంగపరంగా ఇబ్బంది ఉండబోదని వివరించారు. గడచిన ఆరేండ్లు ఆ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్రం నిర్ణయం ఆలస్యం చేయడంతో బిల్లుతో సంబంధం లేకుండా కోటా పెంపుపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకునన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం వద్ద ఉన్న బిల్లుతో సంబంధం లేకుండా ఎస్టీ రిజర్వేషన్లు పది శాతానికి పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. వారంలోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఇటీవల ఆదివాసీ, బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుతో గిరిజనులకు రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెరిగాయి. ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం (మైనార్టీలకు 4 శాతం కలుపుకుని) రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి పదిశాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
ముస్లిం ఫైల్పెండింగ్
ఎస్టీల రిజర్వేషన్లపై ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. అప్పుడే హామీ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లపై మాత్రం తేల్చడం లేదు. ముస్లింలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు 4 శాతం అమలవుతుండగా.. మరో 8 శాతాన్ని పెంచాల్సి ఉంది. అలా అయితే రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏకంగా 72 శాతానికి చేరుతాయి.
కేంద్రం అనుమతే అవసరం లేదు!
ఎస్టీ రిజర్వేషన్ల జీవో నేపథ్యంలో కేంద్రం అనుమతి ఎంత వరకు అవసరమనే అంశం కీలకంగా మారింది. దీంతో కొంతమంది సీనియర్ అధికారులు అసలు కేంద్రం అనుమతి అవసరం లేదంటూ చెప్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ మేరకే ప్రభుత్వం ఇప్పుడు ఎస్టీల రిజర్వేషన్‌ను పెంచింది. ఏడాది క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసినా కేంద్రం ఆ జీవోను నోటిఫై చేయాల్సి ఉండేది. కానీ, గత ఏడాది జరిగిన ఆర్టికల్ 342(ఏ) 105వ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచుతూ జారీ చేసే జీవోకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన జనాభా ప్రాతిపదికన ఉన్న 6శాతం రిజర్వేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 9.34 శాతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో గిరిజన జనాభా 9.98 శాతంగా తేలింది. 2017లో అసెంబ్లీ సమావేశాల్లో ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లు చేసి కేంద్రానికి పంపినా అందులో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఉండటం, మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం మించుతుండటంతో కేంద్రం ఆ బిల్లును తిరస్కరించింది.
అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి మేరకే రిజర్వేషన్ పెంచుతున్నట్లు సీఎం అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ రాజకీయకోణంలో కేంద్రానికి జీవో పంపిస్తామంటూ ప్రకటన చేశారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరాఠా రిజర్వేషన్ల విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు వివరిస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ సమయంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 ఆగస్టు 15న జరిగిన ఆర్టికల్ 342(ఏ) 102 సవరణ ప్రకారం కూడా రాష్ట్రం తీసుకునే రిజర్వేషన్ పెంపును కేంద్రం ఆమోదించాల్సి ఉండేది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వారు కోర్టుకు వెళ్లారు. మరాఠా రిజర్వేషన్ అంశం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 342(ఏ)ను మరోసారి సవరించింది. 2021 సెప్టెంబరు 15న చట్టసవరణ సమయంలో 'స్టేట్' అనే పదాన్ని తొలగించారు. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపును కేంద్రం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కోర్టు పిటిషన్ కొట్టివేసింది.
కోర్టుతోనే కష్టాలు
ఇప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతం దాటిపోయాయి. అయితే దీనిపై ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్తులో ఎవరైనా కోర్టుకు వెళితే ఇబ్బందికరంగా మారనుంది. ప్రభుత్వంలోని ఒక వర్గమే దీనిపై పిటిషన్ వేయిస్తుందనే అనుమానాలు సైతం ఉన్నాయి. కానీ, కోర్టుకు వెళ్తే మాత్రం రాష్ట్రంలో ఈ గిరిజన రిజర్వేషన్జీవోతో చాలా అన్యాయం జరుగనుంది. ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 52,460 పోస్టులకు అనుమతి రాగా, టీఎస్ పీఎస్సీ నుంచి 2,639 పోస్టులకు, పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు నుంచి 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌విడుదలైంది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులు, నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ రూల్స్ఆఫ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఖరారు చేసి, ఏ వర్గాలకు ఎన్ని పోస్టులో ఖరారు చేశారు. గ్రూప్ –1 కింద ఎస్టీలకు 3 పోస్టులు దక్కాయి. ప్రస్తుతం వరకు విడుదల చేసిన 20 వేల పోస్టులకు 6 శాతం అమలు కొనసాగనుండగా.. ఇక నుంచే వచ్చే నోటిఫికేషన్లలో మాత్రం 10 శాతం ఇవ్వాల్సి ఉంది. దీంతో దాదాపు 31 వేల పోస్టుల్లో రిజర్వేషన్లను సవరించాల్సిందే. దీనిపైనే ఆలస్యం అవుతోంది. ఒకవేళ కోర్టు దీనిపై స్టే ఇస్తే మాత్రం.. రిజర్వేషన్లు తేలకపోవడంతో ఉద్యోగాల ప్రక్రియకు బ్రేక్ పడుతోంది.
Also Read: హరీశ్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది.. జగన్ సర్కార్‌పై సీపీఐ రామకృష్ణ సీరియస్