- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. చంద్రబాబుకు స్పేస్ దొరుకుతుందా?
దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబ చేస్తున్న ప్రయత్నం ఆసక్తిగా మారింది. ఇన్నాళ్లు ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించిన ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో రేపు శంఖారావం పూరించనున్నారు. ఖమ్మం జిల్లాలో రేపు భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం తెలంగాణలో చంద్రబాబు హాజరవుతున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో ఈ మీటింగ్ పట్ల ఆసక్తి ఏర్పడింది. మరో వైపు రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్పు తర్వాత తొలిసారిగా జరుగుతున్న భారీ బహిరంగ సభ ఇదే మొదటిది కావడంతో ఈ సభను రాష్ట్ర నేతలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టి తమ సత్తా ఏంటో చాటేలా ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే గాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నాయకులు, అభిమానులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గాల్లో టీడీపీ పట్ల ఇప్పటికీ కన్సర్న్ ఉంది. ఈ సభ ద్వారా మరోసారి బీసీల నినాదాన్ని అందుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో మరి తెలంగాణ వైపు చూస్తున్న చంద్రబాబు రేపటి తన ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత కుమ్ములాటలు తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు తెలంగాణలో స్పేస్ లభిస్తుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read more: