- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబు బుజ్జగించినా శాంతించని బండారు.. మాడుగుల సీటు విషయంలో యూటర్న్ తప్పదా..?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ సీటును కేటాయించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బండారు సీటు అయిన పెందుర్తి, పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోవడంతో ఆయన కినుక వహించారు. రెండు రోజుల క్రితం విశాఖ వచ్చిన చంద్రబాబు ఆయనను సముదాయించినప్పటికీ శాంతించలేదని తెలిసింది.
ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రులు, సీనియర్లందరికీ టికెట్‌లు దక్కాయని, పార్టీ కోసం పోలీసు కేసులు ఎదుర్కొని అరెస్టు కూడా అయిన తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొప్పుల వెలమలకు కేటాయించే మాడుగుల సీటును అదే సామాజిక వర్గానికి చెందిన బండారుకు కేటాయించేందుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా ఆ సీటును ఇప్పటికే పైలా ప్రసాద్‌కు ఇచ్చారు. అయితే, ఆయన పట్ల అసమ్మతి వ్యక్తమౌతుండడం, ఆర్థికంగా కూడా పటిష్టంగా లేరని పార్టీ భావిస్తున్న కారణంగా బండారుకు ఆయన స్థానంలో సీటు ఇవ్వనున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.