ఇలాంటి ఈసీని నేనింతవరకు చూడలేదు.. ఈసీపై శరద్ పవార్ ఫైర్

by Javid Pasha |
ఇలాంటి ఈసీని నేనింతవరకు చూడలేదు.. ఈసీపై శరద్ పవార్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఎన్నికల కమిషన్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే శివసేనకు కేటాయిస్తూ తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని శరద్ పవార్ తప్పుబట్టారు. రాజ్యాంగ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలో అనే దానికి ఇది ఈ ఉదంతం ఓ ఉదాహరణ అని అన్నారు. ఈసీ చర్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని తెలిపారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తన చివరి రోజుల్లో పార్టీ బాధ్యతలను ఉద్ధవ్ థాక్రేకు కట్టబెట్టాలని అనుకున్నారని గుర్తు చేశారు.

Advertisement

Next Story