- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలిటికల్ ఎంట్రీపై విశాల్ క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో:పలువురు సినీ ప్రముఖులు రాజకీయల వైపు చూస్తుండటం ఆసక్తిగా మారుతోంది. ఇటీవలే తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ దళపతి రాజకీయ పార్టీని అనౌన్స్ చేయగా తాజాగా అదే బాటలో మరో స్టార్ హీరో విశాల్ సైతం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు విశాల్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని త్వరలోనే పార్టీని ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తున్న వేళ ఈ అంశంపై విశాల్ రియాక్ట్ అయ్యారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ లేఖను విడుదల చేసిన విశాల్.. దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకుంటున్నామని విద్యార్థులను చదివించడంతో పాటు, రైతులకు సాయం చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడతానన్నారు.
నిరాశలో ఫ్యాన్స్:
విశాల్ పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నారనే వార్తలతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి విశాల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత ఆయన చెన్నై ఆర్కే నగర్ బై ఎలక్షన్ లో పోటీ చేసేందుకు నామినేషన్ సైతం దాఖలు చేశారు. కానీ ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న విశాల్.. ఇంతలో విజయ్ సొంత రాజకీయ పార్టీ ప్రకటించడంతో అతనికి పోటీగా పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని విశాల్ ప్రకటన చేయడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు.