సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

by Javid Pasha |
సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కేసీఆర్ కు ఏమాత్రం అవగాహన లేదని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న మంత్రి.. మళ్లీ ఇప్పుడు అవే జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నట్లు ప్రతిపాదనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, 5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థపై జోకులు వేయొద్దంటూ సూచించారు. 2014లో రూ.60 వేల కోట్లున్న తెలంగాణ బడ్జెట్ ప్రస్తుతం రూ. లక్షల కోట్లకు దాటిందని, కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు.

Advertisement

Next Story